Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page

శ్రీవరదరామదాసు ఆజ్ఞాపత్రం

శ్రీ భద్రగిరి వరదరామదాసుగారి చేవ్రాలుతో ఉన్న (హుకుం) ఆజ్ఞాపత్రం పూర్తపాఠం.

మొహరు

శ్రీ

భద్రాచలరామచంద్ర

మహాప్రభువువారు
అమరవాది చంన్న కృష్ణమాచార్యులుగారు శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకులయ్ని శ్రీ భద్రాచలం సీతారామచంద్ర మహాప్రభ్వు వారి ఆజ్ఞాధారకులయిన మహారాజశ్రీ రాజా తూమునరశింహ్వరామదాసుగారి దాసానుదాసుడు భద్రగిరి వరదరామదాసు శ్రీ మహాప్రభ్వువారి సన్నిధిలో పెద్ద అర్చకులయ్ని శ్రీమాన్‌ గారికి వ్రాయించ్చిన హుకుం.

ప్రబోధశేవకులోగా బీగముద్రలు తియ్యగానే పెద్ద అర్చకుడు సర్కారు తరపు దారోగా, హరిదాసులు, వంత్తు అర్చకుడు వీరు ఏకాంత్తగృహములోకి వెళ్ళి శ్రీ మహాప్రభ్వు వారి విభవం సేవించ్చి శ్రీపాదములయందు వుండే హలకులిశాదిరేఖలు వుండ్డ చూచుకోవలసినది. అయిదవవారు(.) రాజప్తాసంగన్కు యుక్తమయిన వారికి శలవు ప్రకారమే శేవ లభింప్పచేశేది.

ప్రబోధశేవ యథావిధిగా జరుగుతూ వుంన్నది. సరికదా శేవవేళకు చత్రచామరములు శిద్దముగా వుండవలసినది. యేనుగ పెద్దగుర్రము కోవెలదగ్గర ఉండవలశ్నిది. డంకానిమిత్తంలేదు. ప్రబోధశేవలో పళ్ళెములో దువ్వెన కాటుకకాయ, అద్దము, యివి వుంచ్చి సన్నిధిలో వుంచ్చవలసినది.

బాలభోగము యధావిధిగా జరుగుతూ యున్నదిసరే, ప్రభ్వువారి యుర్రతయిరు ప్రసాదము, ఘృతపొంగ్గలి షక్కర్‌ పొంగ్గలి అరసోల -సోల తిరువీసం దోశేలు యివి ఆరగింప్పుకావలశ్నిది.

మున్పువుంన్న గిన్నెలలో పెద్దగింన్నెగా విచారించి షక్కర్‌ పొంగ్గలి ఉంచవలశ్నిది.

పెద్దగిన్నెలు రెంట్టిలో యర్రతయిరు ప్రసాదము ఘృతపొంగ్గలి వుంచవలసినది.

నరశింగరావుగారు చేయించవలసిన వెండిగింన్నె చేయించ్చిరా సరే, లేదా రు. 80 యనభయిరూపాయలకు వకగింన్నె జరూరుగా చేయించి తిరువీసము వుంచ్చేది.

సత్రములో ఉండ్డే వెండిపళ్ళెం తెప్పించి దోశెలు వుంచ్చేది.

యీ ప్రకారము జరిగించ్చేది.

నాయకతళిహ తదియ్యారాధన యథావిధి జర్గించ్చవలసినది.

ప్రకాశోత్సవము వరకుంన్ను ఏకాంతమున్ను అమ్మవారు శేవచేసే కాలముకనుక బారామి ఫలముల పప్పు, ఖండషక్కర తు 3, ఆరగింప్పు చాయవలశినది. బంగ్గారు గింన్నెలు తోటి చామర కైంకర్యము నిశ్శబ్దముగా జరిగించ్చవలసినది. వంత్తు అర్చకుడు హరిదాసు పెద్దఅర్చకుడు దారోగావుండ్డి స్తానాచార్యులు. అధికారి యింక్కా వకరు యవరయినా శేవించ్చతగును.

ప్రభుత్వ శేవ యథావిధిగా జరగటములో వెండికలం దాసు, బంగ్గారుకలం, సిరాబుడ్డి, సునెరిరికాగిదం, బంగ్గారు మొహరు చుక్కను యివి సంన్నిధిలో పీటమీద వుంచ్చవలసినది. ఇది నిరంత్తరం మరియాద.

యేకాంత్త శేవలు కట్టువెంబడిని శేవచేసి, భయం కలిగి బయటకు వచ్చి వంత్తు అర్చకుని తాళంవకటి సత్రమర్చకుని మరుతాళంవకటి బీగముద్రలు వేశి సర్కారు తాళం పెద్ద అర్చకుని వద్దనయినా దారోగా వద్ద నయినా వుంచ్చేది. వుదయాత్పూర్వమే యధావిధిగా వెళ్ళి హాజరువుండి యధావిధిగా జరిగించ్చేది.

శుక్రవారము ఏకాదశులు, అమావాశ్యలు, పౌర్ణవములు మొదలయ్ని కోవెల ఉత్సవములు పదివిలాయిలు (కాగడాలు) వేయించ్చి మూడు ప్రదక్షిణముల్కు - వకప్రదక్షిణం హరిదాసులనృత్యం వకప్రదక్షిణం బోగమువాండ్ల నృత్యం, వకప్రదక్షిణం సకలవిభవములతోటి హెచ్చరికలతోటి మందిరము ప్రవేశించ వలశినది.

పునర్వసు ఉత్సవము యథావిధిగా జరిగించ్చు వలసినది.

తిరునక్షత్రము మొదలయినవి యథావిధిగా జరిగించ్చవలెను.

అథ్యయనోత్సవములకు గోవింద్దరాజుల కోవెలదగ్గర కోటావేయించ్చేది. పునర్వసు మంట్టపము దగ్గిర కోటావేయించ్చేది. కోవెలలో కోటావేయించ్చేది. చుట్టూ మోకాటి యెత్తు గోడపెట్టించి ద్వాదశి మంట్టపం మీదనుంచ్చి (జనం పడకుండా) కటకటా కట్టించ్చేది. విస్తారము పంద్దిరి వేయించి మధ్య శింహాసనము వేయించి నాలుగు స్తంభాలు కట్టి శృంగ్గారం చేస్తే ముక్యోటి యేకాదశి ఉదయాత్పూర్వం అక్కడికి వేంచ్చేశి బాలభోగము వేళ్ళకు తిరిగి కోవెలలో ప్రవేశించేటట్టు మర్యాద చేశేది. నిరంత్తరం ఉదయకాలవుత్సవము పదిరోజులు పునర్వసు మంటపములోనే రాత్రి వుత్సవము పదిరోజులు గోవిందరాజుల కోవెలలో కాగా నిర్ణయించేది. రేపుమాపు వుత్సవములు గాక కోవెలశేవలు వేరే జాగ్రత్త చేశేది. యిది వకకటా దిట్టము.

దశరా వుత్సరములు యథావిధిగా మామూలు ప్రకారము.

తిరుకల్యాణ ఉత్సవము డోలావుత్సవము సహస్రఘటాభిషేకము యథావిధిగా జరుగగలందులకు సహస్రఘటాభిషేకమునకు గావలసిన యావద్ధ్రవ్యము తప్సిలు వ్రాయించ్చి వుంచ్చేది.

అధ్యయనోత్సవములలో వచ్చిన యావజ్ఞనానికీ సత్రములో అన్నాదికములు భోజనము పెట్టించ్చేది. సంన్నిధిలో వైదేశికులలో పదిమాన్నెలు యెక్కువచేశేది. తళిహ మామూలు ప్రకారము యేమివిశేషము వుండ్డేదో ఆ ప్రకారము జాగ్రత్త చేశేది. నాయిక తళిహ యిద్దున్నిరస (160 శేర్లు) ఆ దినములలో కూడా చేశేది.

తెల్ల వస్త్రములు కనుమాసినవి ధరియింప్పవద్దు. స్వామి వారికి కట్టిన బట్టలు తిర్గి స్వామివారికి ధరియించ్చవద్దు. జాగ్రత్త. పదహారు నెంబర్లులో వాయించ్చిన పద్ధతులు పూరాగా ఆకలింపులోకి తెచ్చుకొని యేయే కాలములో జర్గే కైంకర్యములు ఎడల లోపం రాకుండా జర్గింస్తూ వుండ్డవలశ్నింది,

ఖరనామసంవత్సర కార్తీకశుద్ధ నవమి ఆదివారం

ద. భద్రగిరి వరదరామదాసు

ఈ హుకుం చాలవిలువైన దస్తావేజు. చివర వరద రామదాసుగారి సంతకం కుదిరికగా చక్కని అక్షరాలతో ముచ్చటగా వుంది. ఈ వరద రామదాసు ములికినాటి వైదిక బ్రాహ్మణులు మహాభక్తులు. చెన్న పట్టణమునకు చెందినవారు. వీరి నెచ్చెలి తూము లక్ష్మీనరసింహా దాసుగారు గుంటూరికి చెందిన గోలుకొండ వ్యాపారులు. ఈ భక్తులిరువురూ ఏటేటా శ్రీరామనవమికి భద్రాచలయాత్ర చేస్తూ మిత్రులై రామదాసు అనంతరం క్షీణదశలో ఉన్న దేవాలయ పరిస్థితులను పునరుద్ధరించుటకై నడుము కట్టుకొని ఆనాటి నైజాము ప్రధాని రాజా చండూలాలుగారి సహాయంతో పై ఏర్పాట్లు కావించారు.


Jagathguru Bhodalu Vol-9        Chapters        Last Page